prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 11:27 am Digital Edition : PRAJA VANI

ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి

*ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి*

*ముధోల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దీపావళి శుభాకాంక్షలు*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 8:–
దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత, పరస్పర ప్రేమానురాగాలు మరింత పెరగాలని, ముధోల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. పండుగను సంప్రదాయబద్ధంగా, పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలని సూచించారు.