prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 5:08 pm Digital Edition : PRAJA VANI

ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి.. దీపావళి శుభాకాంక్షలు మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్

ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి.. దీపావళి శుభాకాంక్షలు మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 08

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగగా దీపావళికి హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో జిల్లా ప్రజలందరికీ అన్నింటా శుభం కలగాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా చిన్నపిల్లలు టపాసులు, కాల్చే సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా సురక్షితంగా పండుగను జరుపుకోవాలని కోరారు. దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశలు, ఆనందాలు నింపాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.