పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన – సర్పంచ్ మల్లయ్య బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం పోషకాహార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషకాహారం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పోషకాహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని, పోషక విలువలతో...