prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:50 pm Digital Edition : RAJASHEKARREDDY

పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన – సర్పంచ్ మల్లయ్య

బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం పోషకాహార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషకాహారం  యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పోషకాహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అనంతరం చిన్నారులకు బరువు, ఎత్తు పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు శోభ, భారతి, మాజీ ఉపసర్పంచ్ గుగ్గిళ్ల తిరుపతి, అంగన్‌వాడీ ఆయా సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.