పోరుమామిళ్ళలో ఘనంగా‘సుస్థిర జీవనశైలి వారోత్సవాలు’ఒక గంట విద్యుత్ నిలిపివేత,పాఠశాలలో ప్రతిజ్ఞ
పోరుమామిళ్ళ (కడప జిల్లా) నవంబర్ 2 ప్రజావాణి దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా "సుస్థిర జీవనశైలి వారోత్సవాలు"-2026ను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా రెండవ రోజు సోమవారం పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి శ్రీ రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ,ఇంధన పొదుపుపై ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఒక గంట పాటు విద్యుత్ నిలిపివేత (స్విచ్ ఆఫ్): పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో విద్యుత్ పొదుపు ఎంతటి కీలకమైనదో ప్రాక్టికల్‌గా నిరూపిస్తూ, పోరుమామిళ్ళ...