పోరుమామిళ్ల సర్కిల్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – మైదుకూరు డీఎస్పీ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు

ప్రలోభాలకు తావులేకుండా,ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుందాం.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం!” పోరుమామిళ్ల నవంబర్ 04 ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని దమ్మనపల్లి ఎంపీటీసీ, చిన్నయ్యరసాల ఎంపీటీసీ స్థానాలతో పాటు,కలసపాడు మండల ఎంపీటీసీ,జడ్పీటీసీ మరియు కాశీనాయన మండల జడ్పీటీసీ ఉప ఎన్నికల సమరం ముగింపు ఘట్టానికి చేరుకుంది.ఈ ప్రాంతాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచార పర్వానికి ఈరోజు సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ప్రచార గడువు ముగియడంతో ఇకపై ఎలాంటి బహిరంగ సభలు,రోడ్ షోలు,మైకుల హోరుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే...