పోరుమామిళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో బోల్తా పడి వృద్ధుడు అక్కడికక్కడే మృతి, డ్రైవర్ పరారీ!
పోరుమామిళ్ల:కడప జిల్లా నవంబర్ 08ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.మండల కేంద్రమైన పోరుమామిళ్ల నుండి కవలకుంట్ల గ్రామానికి ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆటో.. పోరుమామిళ్ల సమీపంలోని మల్లకత్వ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యనమల చిన్న సుబ్బయ్య (65) అనే వృద్ధుడు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ప్రమాదం జరిగిందిలా.స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరుమామిళ్ల నుండి కవలకుంట్ల గ్రామానికి...