పోరుమామిళ్ల ఎమ్మార్వో ఆఫీస్‌లో ‘డీటీ’ ఇష్టారాజ్యం: 11 దాటినా ఖాళీగా ఉన్న కుర్చీ, పడిగాపులు కాస్తున్న జనం!

పోరుమామిళ్ల,నవంబర్ 2: ప్రజావాణి వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కార్యాలయంలో అత్యంత కీలకమైన డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలు దాటినప్పటికీ డీటీ సీటు ఖాళీగానే దర్శనమివ్వడం ఇక్కడి విధుల్లో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కథనాలు వచ్చినా మారని తీరు: పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో అధికారుల లేటు రాకపై, ప్రజల...