పోరుమామిళ్లలో నిబంధనలు గాలికి: టపాసుల కేంద్రాల్లో అక్రమ దందా. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా?

పోరుమామిళ్ల రూరల్: నవంబర్ 07ప్రజావాణి మండల కేంద్రంలో టపాసుల విక్రయ కేంద్రాలు అక్రమాలకు, ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా వ్యాపారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. పత్రికల్లో వరుసగా వార్తలు వస్తున్నా, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై, వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిల్లు లేదు.. నిలదీస్తే బెదిరింపులు! మండలంలోని ఏ ఒక్క టపాసుల...