పోతంగల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ పోటీలు.
కోటగిరి/ప్రజావాణి:-ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా,చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ తెలంగాణ,నిజామాబాద్ జిల్లా కలెక్టర్, బాన్సువాడ ఈఆర్ఓ,ఆర్డీఓ ఆదేశాల మేరకు ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో పోతంగల్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.విద్యార్థు ల్లో ఓటు హక్కు,ఎన్నికల విధానంపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహించారని నిర్వాహకు లు తెలిపారు.ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలలో 25 మంది,క్విజ్ పోటీలలో 20 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. పోటీల అనంతరం నిర్వహకులు విజేతలను ప్రకటించారు.వ్యాసరచన పోటీల నుండి ఇద్దరు,క్విజ్ పోటీల నుండి ఇద్దరు చొప్పున ప్రతిభ చూపిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు.ఎంపికైన ఈ నలుగురు విద్యార్థులు తదుపరి నియోజకవర్గ స్థాయిలో జరగబోయే పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి,పొతంగ ల్ మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్.బాలు, ఎమ్మార్వో సందీప్,ఎంఈఓ సాయిలు, ఎంపీడీవో చందర్ నాయక్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయు లు,విద్యార్థులు పాల్గొన్నారు.