prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:44 am Digital Edition : PRAJA VANI

పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం

పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం

సర్పంచ్ బైర మానస రాజేందర్

బెజ్జంకి, నవంబర్ 4 (ప్రజావాణి)

పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారమవుతుందని దాచారం గ్రామ సర్పంచ్ బైర మానస రాజేందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో తపేట మమత–మల్లేశం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ బైర మానస రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని,బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.తమ సొంతింటి కలను నెరవేర్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, సర్పంచ్ బైర మానస రాజేందర్‌లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీటి బాలనర్సు,వార్డు సభ్యులు అశోక్, మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్, చంద్రయ్య, రాజేశం, సత్తయ్య, దీటి రాజు,తదితరులు పాల్గొన్నారు.