prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 4:26 pm Digital Edition : PRAJA VANI

పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నిరసన

పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నిరసన

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 పులివెందుల వైఎస్ఆర్ జిల్లా

పోలింగ్‌ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకపోవడంపై అభ్యంతరం

ఆర్వోను కలిసేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

ఆర్వో కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన

పులివెందుల మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకోవడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దృష్టికి తీసుకెళ్లేందుకు పులివెందులలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారిని అధికారులు లోపలికి అనుమతించలేదు.

దీంతో ఆర్వో కార్యాలయం ఎదుటే శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బైఠాయించి ఈ నిరసన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రతి గ్రామం నుంచి తరలివచ్చి నిరసనలు తెలిపారు.