prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 2:17 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పాతగూడూరు గ్రామానికి రూ. 80 వేల విలువైన బాడీ ఫ్రీజర్ విరాళం

ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామ వాస్తవ్యులు సుంకిశేల నారాయణరావు కుమారుడైన సుంకిశేలా శ్యామసుందర్ రావు గ్రామంలో మృతి చెందిన వారి చివరి చూపు కోసం దూర ప్రాంతాల నుండి వచ్చేవారి సౌకర్యార్థం రూ. 80,000 విలువైన బాడీ ఫ్రీజర్‌ను గ్రామ పంచాయతీకి విరాళంగా అందించారు. గ్రామ పాలకవర్గం, ప్రజల సమక్షంలో అందజేసిన ఈ సత్కార్యానికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ మేడిపల్లి సత్యనారాయణ, వార్డు సభ్యులు కోట శ్రీశైలం, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.