పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి..

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి.. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03(ప్రజావాణి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు ఈ నెల 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులందరూ సకాలంలో తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. తొర్రూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ...