నెల్లుట్లలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ..
సద్వినియోగం చేసుకోవాలన్న సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ, గేదెలు, ఆవులు పెంపకందారులు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా నట్టల నివారణ మందు వేయడం ద్వారా పశువులను అనేక ప్రాణాంతక రోగాల నుండి కాపాడుకోవచ్చని, తద్వారా పాల దిగుబడి పెరిగి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్ కొయ్యడ అనిల్, వెటర్నరీ డాక్టర్లు వాసు, శైలజ, రైతులు, పశు పోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
