prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:07 pm Digital Edition : PRAJA VANI

నెల్లికుదురు ప్రజావాణి కి ఏడు దరఖాస్తులు

నెల్లికుదురు ప్రజావాణి కి ఏడు దరఖాస్తులు..
ఎంపీడీవో కుమార్
ప్రజావాణి,నెల్లికుదురు:ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారం వారం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన ప్రజావాణి కొనసాగుతోంది. మండల కేంద్రం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో సింగారపు కుమార్ తోపాటు 28 శాఖల అధికారులు పాల్గొని ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కుమార్ దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. ప్రజావాణి కి మండల వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై 07దరఖాస్తులు అందజేసినట్లు వెల్లడించారు. హౌసింగ్ సమస్యల పై 3 దరఖాస్తులు,పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పై1 దరఖాస్తు, రెవిన్యూ 1,ఇరిగేషన్ సమస్యపై 1, అటవీ శాఖ ప్రాబ్లం పై 1 ఫిర్యాదు సంబంధిత బాధితుల నుంచి వచ్చినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. ప్రజావాణిలో పలు శాఖలకు చెందిన అధికారులు హాజరవుతున్న దృష్ట్యా సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక చక్కని వేదికని,మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.