దోస్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో బి. శ్రీనివాస్..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 04
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోస్ పల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం రోజున పరిశీలించారు.. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ…. ఉదయం తొందరగా వచ్చి ఇచ్చిన కొలతల ప్రకారం పనులను చేయాలని కోలతల ప్రకారం పని చేస్తే దినసరి కూలీ 307 రూపాయలు వస్తాయని, చేసే పని సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవోతో పాటు ఈసీ స్వామి గౌడ్, సర్పంచ్ మారుతి, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు తదితరులు పాల్గొన్నారు