prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 11:51 am Digital Edition : PRAJA VANI

దేగాంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

*దేగాంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా*

*కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట.. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ బీమా అమలుకు చర్యలు: మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో బైంసా నవంబర్ 8:–
బైంసా మండలంలోని దేగాం గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. అదేవిధంగా కొడంగల్‌లో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు సైతం అండగా నిలిచేందుకు ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, పేదల ఆర్థిక అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొబ్బిలి శ్రీను, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరూక్ అహ్మద్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మౌలాఖాన్, వార్డు సభ్యులు సుదర్శన్ గౌడ్, సాయి, ఆనంద్, చోటు, ఎల్లా రాజేశ్వర్, వాటోలి సర్పంచ్ ఎగ్గం నడిపి సాయన్న, ఉప సర్పంచ్ గఫూర్, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, మజీద్ చౌదరి, చందు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కిష్టన్న, సాయిలు, రమేష్, వాగమరే శ్రీను, బొగ్గుల మహేష్, వాగమరే గౌతమ్, అబ్దుల్ రియాజ్, ఇక్బాల్ అహ్మద్, ఎస్.డి. అన్వర్, ఫరూక్, జాదవ్ సోమాజి, శానే అవినాష్ తదితర సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.