prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:21 am Digital Edition : PRAJA VANI

దూల్మిట నూతన ఎంఈఓగా పసుల కోటయ్య బాధ్యత స్వీకరణ

దూల్మిట నూతన ఎంఈఓగా పసుల కోటయ్య బాధ్యత స్వీకరణ

మద్దూరు నవంబర్3, ప్రజా వాణి,

దూల్మిట్ట మండల విద్యాశాఖ అధికారిగా పసులకోటయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూటిగల్ పిజిహెచ్ఎం సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయ సంఘాలు పి ఆర్ టి యు,తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియూఎస్), యుటిఎఫ్, టి పి టి ఎఫ్ ,డిటిఎఫ్, జి టి ఏ,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం,
పి ఎస్ హెచ్ఎంఏ, ఎస్ జి టి యు,సంఘ బాధ్యులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓగా పదవి విరమణ పొందిన అనుముల కరుణాకర్ రెడ్డి పసుల కోటయ్యకు మండల విద్యాశాఖ అధికారిగా ఇన్చార్జిని అప్పగించారు.ఈ సందర్భంగా నూతన ఎంఈఓ పసుల కోటయ్య మాట్లాడుతూ మండలంలో విద్యావ్యవస్థను జిల్లాలోనే ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తానని అందుకు మండలంలోని ఉపాధ్యాయులు అందరూ తనకు సహకరించాలని కోరారు.