prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 4:07 pm Digital Edition : PRAJA VANI

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత డీజే బాలాజీ ముదిరాజ్

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత డీజే బాలాజీ ముదిరాజ్

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 08

దీపావళిపర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు, వివిధ కాలనీల ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, ఉన్నతాధికారులకు బీజేపీ నేత డీజే బాలాజీ ముదిరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇల్లు ఆనందాల వెలుగులతో విరాజిల్లాలని, ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
జుక్కల్ నియోజకవర్గ ప్రాంతంలో ఐక్యత, అభివృద్ధి, సోదరభావం మరింత పెంపొందాలని, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని డీజే బాలాజీ ముదిరాజ్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సురక్షితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.