దీపావళి పర్వదినాన 1,100 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ
అనంతగిరి: తెలంగాణ శబరిమలగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం 33వ రోజుకు చేరుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 1,100 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ప్రజవాణి అనంతగిరి
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మహారాజపోషకులు బుర్రా పుల్లారెడ్డి – సుధారాణి దంపతులు, బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ – ప్రత్యుష దంపతులు వ్యవహరించారు.
అయ్యప్ప స్వాముల సేవే లక్ష్యంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, నలజాల రామకృష్ణ, ఈదుల సత్యం, ఆవుల వీరబాబు, కొమెర వెంకన్న, పి. నరసింహారావు తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
దీపావళి పర్వదినాన పెద్ద సంఖ్యలో స్వాములకు అన్నప్రసాదం అందించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.