prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 12:56 pm Digital Edition : PRAJA VANI

దయాకర్ రావుతో అను సంబంధం మరువలేనిది ఆపరేటర్ జైపాల్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు

దయాకర్ రావుతో అను సంబంధం మరువలేనిది ఆపరేటర్ జైపాల్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు

నారాయణఖేడ్ ఆర్సీ, అక్టోబర్ 31 (ప్రజావాణి)

కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దయాకర్ రావు పదవీ విరమణ సందర్భంగా ఆపరేటర్ జైపాల్ రెడ్డి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా దయాకర్ రావును శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దయాకర్ రావు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, మండల అభివృద్ధికి తనవంతు కృషి చేశారని కొనియాడారు.ఉద్యోగ జీవితంలో అధికారులతో,ప్రజాప్రతినిధులతో, సిబ్బందితో ఆత్మీయ సంబంధాలు కొనసాగించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.పదవీ విరమణ పొందినప్పటికీ ప్రజలతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుందని జైపాల్ రెడ్డి అన్నారు.