తాళ్ల శ్రీనివాస్ మృతి పట్ల గొర్రె కిరణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి!
పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్
హసన్పర్తి, (మన ప్రజావాణి):
అనారోగ్యంతో మృతి చెందిన తాళ్ల శ్రీనివాస్ గారి మృతిపట్ల 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు పుల్ల జార్జి, తాళ్ల మధు, దేవరకొండ ఐలేష్, జన్ను అశోక్, బొల్లె రంజిత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.