prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 7:09 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు హెల్ప్ డెస్క్ ఏర్పాటు

తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు హెల్ప్ డెస్క్ ఏర్పాటు

చెన్నారావుపేట అక్టోబర్ 31 ప్రజావాణి

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు-2027కు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ చెన్నారావుపేట మండల కేంద్రంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా పట్టభద్రుల సౌకర్యార్థం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ఏఈఆర్ఓ, చెన్నారావుపేట తహసిల్దార్ దిలావర్ మహమ్మద్ అభిద్ అలీ తెలిపారు.మండలంలోని అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు, ఫారం-18 దరఖాస్తులను సేకరించేందుకు అధికారులు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6, 2026 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. నవంబర్ 1, 2023 నాటికే డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఈ ఓటు హక్కుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు.గత ఎన్నికల ఓటర్ల జాబితాతో సంబంధం లేకుండా, ప్రస్తుతం సరికొత్త జాబితాను తయారు చేస్తున్నందున పాత ఓటర్లు సైతం తప్పనిసరిగా ఫారం-18 ద్వారా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.