prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 7:41 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

జిల్లా బ్రీడింగ్ చెకర్స్ కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శులుగా ముత్యం రాజు, జన్ను సరిత ఏకగ్రీవ ఎన్నిక

జిల్లా బ్రీడింగ్ చెకర్స్ కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శులుగా ముత్యం రాజు, జన్ను సరిత ఏకగ్రీవ ఎన్నిక

చెన్నారావుపేట నవంబర్ 03 ప్రజావాణి

వరంగల్ జిల్లా బ్రీడింగ్ చెకర్స్ కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శులుగా ముత్యం రాజు మరియు జన్ను సరిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు భూక్య శ్రీనివాస్ ఒక ప్రకటనలో అధికారికంగా తెలియజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శులు ముత్యం రాజు, జన్ను సరిత మాట్లాడుతూ… తమ ఎన్నికకు సహకరించిన యూనియన్ అధ్యక్షులు భూక్య శ్రీనివాస్‌కు, జిల్లా బ్రీడింగ్ చెకర్స్ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.