prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 9:49 am Digital Edition : PRAJA VANI

జిలుగుమాడు ద్వారకా నగర్ లో రోడ్లు అస్తవ్యస్తం

*జిలుగుమాడు ద్వారకా నగర్ లో రోడ్లు అస్తవ్యస్తం…*

*ఇండ్లలో నుంచి బయటికి రావాలంటేనే ఇబ్బందిగా మారిన వైనం..*

మధిర : మన ప్రజావాణి నవంబర్ 4

*వర్షం వస్తే చిత్తడి చిత్తడిగా మారుతున్న రోడ్లు..*

*వెంటనే అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్న ఆ కాలనీవాసులు..*

మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు ద్వారకా నగర్ లోని రోడ్లన్నీ ఈ వర్షానికి అస్తవ్యస్తంగా తయారై చిత్తడిగా మారిందని ఆ కాలనీవాసులు వాపోతున్నారు. వర్షం వస్తే ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నామని అత్యవసర పరిస్థితి అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున మున్సిపాలిటీ అధికారులు వార్డ్ కౌన్సిలర్ స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.