prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 6:14 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలి

 

*దంతాలపల్లి మండలంలో టీఎస్ జేయు నూతన మండల కమిటీ ఎంపిక*

*టీఎస్ జేయు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పంతం సురేందర్*

దంతాలపల్లి
నవంబర్ 6(ప్రజావాణి)
జర్నలిస్టుల సంక్షేమం కోసం సమష్టిగా నిరంతరం పోరాడుతూ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పంతం సురేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం దంతాలపల్లి కేంద్రంలోని టీఎస్ జేయూ మండల సమావేశం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ తొర్రూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిజెల్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం టీఎస్ జేయు స్టేట్ కౌన్సిల్ నెంబర్ పంతం సురేందర్ ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్‌ కార్డులు ఇప్పించేందుకు యూనియన్ చర్యలు తీసుకుంటోందని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించే విధంగా ఉద్యమించాలన్నారు. అదేవిధంగా నిరంతరం జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని ఆయన సూచించారు. అనంతరం

*దంతాలపల్లి మండల నూతన కార్యవర్గం ఎన్నిక*
– అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అనపర్తి వీరన్న, కొండ వెంకన్న

దంతాలపల్లి టీఎస్ జేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అనపర్తి వీరన్న గౌరవ అధ్యక్షులుగా భూపతి కాశయ్య గౌడ్ ఉపాధ్యక్షులుగా మిడతపల్లి సురేందర్ ప్రధాన కార్యదర్శిగా కొండ వెంకన్న, జిల్లా నాయకులు పంతం విజయేందర్ ను ఎంపిక చేయడం జరిగింది.