prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 7:29 pm Digital Edition : PRAJA VANI

జనగామ లో మన ఆలోచన సాధన సమితి (MASS) ఆధ్వర్యంలో నల్ల నర్సింహులు 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..

జనగామ లో మన ఆలోచన సాధన సమితి (MASS) ఆధ్వర్యంలో నల్ల నర్సింహులు 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..

నల్ల నర్సింహులు చరిత్ర భావితరాలకు అందించాలి.. చింతకింది అరుణమ్మ

ఆయన త్యాగాలు తరతరాలకు ఆదర్శం. పిట్టల సత్యం మాస్ జనగామ కన్వీనర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ పోరాటాల స్ఫూర్తిప్రదాత, ప్రజా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నల్ల నర్సింహులు 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మన ఆలోచన సాధన సమితి (MASSS) ఆధ్వర్యంలో మాస్ జనగామ కన్వీనర్ పిట్టల సత్యం ఆధ్వర్యంలో గురువారం జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింగరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంగళంపల్లి రాజు అధ్యక్షత వహించారు. ముందుగా నల్ల నర్సింహులు విగ్రహానికి పూలమాల వేసి నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. నల్ల నర్సింహులు అన్యాయంపై అలుపెరుగని పోరాటానికి, అణగారిన ప్రజల హక్కుల సాధనకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల విముక్తి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన జీవిత చరిత్రను, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

నల్ల నర్సింహులు కుమార్తె అరుణమ్మ, కుటుంబ సభ్యులు, డాక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఆయన ధైర్యసాహసాలు, త్యాగనిరతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

మాస్ జనగామ కన్వీనర్ పిట్టల సత్యం మాట్లాడుతూ.. నల్ల నర్సింహులు చేసిన త్యాగాలు తరతరాలకు ఆదర్శమని, ఆయన ఆశయాలను యువతకు పరిచయం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏల సుందర్ మాట్లాడుతూ నల్ల నర్సింహులు ఆశయాలను కేవలం వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. సమాజంలో అసమానతలు తొలగి, పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిట్టల సత్యం, ఎలగందుల కృష్ణ, గుర్రం నాగరాజు, ఏల హరినాథ్, జి. కృష్ణ, సోమ నరసింహాచారి, ఆసర్ల సుభాష్, తుంగ కౌశిక్, సాయన్న, సోమన్న, దిగోజు, కొలిపాక నర్సింహులు, కీర్తి వీరేందర్, బిట్ల శంకర్, జేరిపోతుల అబ్బయ్య, సాంబాచారి, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కవులు, కళాకారులు పాల్గొని నివాళులు అర్పించారు.