prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 7:25 pm Digital Edition : PRAJA VANI

జనగణన లోని బీసీ కాలాన్ని పెట్టాలి

జనగణన లోని బీసీ కాలాన్ని పెట్టాలి.
అది బీసీల ఆత్మగౌరానికి ఇచ్చిన అరుదైన గౌరవంగా ఉంటుంది.

జవహర్ నగర్ నవంబర్,5( ప్రజావాణి ప్రతినిధి )

మనదేశంలో లో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, ఎవరు పాలన అధ్యక్షుడిగా ఉన్న, దేశంలో ఎజెండాలు ఎగిరిన, ఆ జెండా లకు బీసీల ఓట్లు మాత్రమే కావాలి, ఆ జండా లకు జెండాలు మోసే బీసీకార్యకర్తలే కావాలి, ఊరిలో నైనా రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా (రిజర్వేషన్లు తప్ప) తక్కువ జనాభా కలిగిన అగ్రకులాలనే అధికారం. దేశంలో ఓబీసీలం ఎంతమంది ఉన్నామే మాకు తెలియదు. అప్పుడెప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన బీసీల లెక్కలే ,ఈ దేశ బీసీలకు దిక్కు, ఎలక్షన్స్ వస్తే అన్ని పార్టీలు బిసిల ఓట్ల కోసం మేము బి సి కులజన గణన చేస్తాము అనిఅధికారంలోకి వస్తే. అని హామీలు ఇచ్చిన పార్టీలు ఎన్నో మరెన్నో, ఇక మేము ఎంత మంది మో ఈ దేశంలో మా మా ఓబిసి లెక్క తేలుతుంది. అనుకున్న తెల్లారే అధికారంలోకి వచ్చినాక ఆ మాట దాటి వేస్తున్నా పార్టీలు ఇప్పుడు కూడా అధికారం లోనే ఉన్నాయి. అయినా బీసీల లెక్కలు చెప్పడం లేదు.మొన్న ఎలక్షన్ లో బిజెపి పార్టీ కూడా ఈసారి అధికారంలోకి వస్తే బీసీల కుల జన గణన చేపడతామని అని అధికారంలోకి వచ్చిన పార్టీయె. కొన్ని రోజుల క్రితం రాజ్ నాథ్ సింగ్ మాత్రం బీసీలకు కుల జనగణన చేయాల్సి ఉందని కేంద్రానికిలేఖ రాసిన. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ఈ దేశ ఓ బి సి లు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు ఉన్నారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల ఎమ్.పిలు కూడా బీసీ కులాల జన గణన జరగాలని నినదించుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలపై మొండి వైఖరి ప్రదర్శిస్తున్న చందంగా వ్యవహరించడం పట్ల ఈ దేశంలో ఉన్న ఓబీసీలపై కేంద్ర ప్రభుత్వం కారుస్తున్న మొసలి కన్నీళ్లు ఈ దేశ బీసీ ప్రజానీకం గమనిస్తున్న తరుణంలో అతి తొందరలో ఒక రైతు ఉద్యమం లాగా, బీసీ ఉద్యమం కూడా దేశ వ్యాప్త ఉద్యమం గా మారబోతుంది అని కొంతమంది సామాజిక కార్యకర్తలు మేధావులు ఇప్పటికే ప్రకటించారు. అసలు వెనుకబడిన తరగతుల ఉద్యమం ఎప్పుడు మొదలైందో తెలుసుకుంటే.1857 ప్రథమ స్వాతంత్ర్య ఉద్యమం సిపాయిల తిరుగుబాటు కొంత కాలం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన రంగంలో లో కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు తీసుకు వచ్చింది. వేగంగా కొన్ని మార్పులను కూడా చేపట్టింది.ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉద్యోగాల్లో అగ్రవర్ణాల అధికారుల ఆధిపత్యం ఉండేది. అంతే కాకుండా ఇంగ్లీష్ విద్యా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో వారిదే అగ్ర చేయిగా ఉండేది.
అలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణేతర వర్గాలు, ముస్లిం వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలయింది. వివిధ రంగాల్లో తమ కూడా ప్రాతినిధ్యం కల్పించాలని, బ్రిటిష్ పరిపాలకుల పై ఒత్తిడి తేవడం మొదలయ్యింది, ఈ విషయానికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన 1851 లో జరిగిన జనాభా లెక్కల సేకరణ లో అనేక మైనటువంటి వెనుకబడిన తరగతుల్లో, మైనారిటీలో, ఉన్న అక్షరాస్యత, ఉద్యోగ వివరాలు, సామాజిక స్థితిగతులు, జీవన ప్రమాణ స్థాయి, మొదలైన వాటిని 1851 రిపోర్టు సవివరంగా వెల్లడించింది.మొట్టమొదటగా ముస్లింలు చైతన్యవంతమై 1909 చట్టం ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు సాధించుకున్నారు. దాని ఫలితంగా కొంతకాలానికి సిక్కులు, అణగారిన వర్గాలకు నిమ్న కులాల వారికి, క్రిస్టియన్లకు, విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు అయ్యాయి.
ముఖ్య కారకులు మహాత్మ జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియర్ రామస్వామి, శూద్ర కులాలకు అన్ని రంగాల్లో ప్రధాన పాత్ర వహించిన మహనీయులు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ రక్షణa కొరకు వెనకబడిన వర్గాల కోసం 1953 జనవరిలో కకా కలేల్కర్ కమిషన్ను అప్పటి ప్రభుత్వం నియమించింది ఇదే మొట్టమొదటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ గా చెప్పుకోవచ్చు. 1955లో మార్చిలో ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది ఈ నివేదికలో దేశం మొత్తం మీద 2399 కులాలను వెనుకబడిన తరగతుల గుర్తించింది. అందులో 837 కులాలను బాగా వెనుకబడిన తరగతుల గా గుర్తించారు.వెనుకబడిన తరగతుల సర్వతో ముఖం అభివృద్ధికి అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని 1851లో చేసిన బీసీ కుల జనగణన సరిపోదని, 1961 లోపు కులాల వారిగా జనాభా లెక్కలు చేయవలెనని ముఖ్యంగా సూచించింది. అంతే కాకుండా మరికొన్ని సూచనలు కూడా ఆ కమిషన్ సూచించడం జరిగింది
అవి వయోజన విద్య, విశ్వవిద్యాలయాల,చదువు మొదలగు అనేక రంగాలలో వెనుకబడిన తరగతుల వారి కోసం సత్వర అభివృద్ధి పథకాలు చేపట్టాలని సూచించారు. స్త్రీలను అందరిని వెనుకబడిన తరగతుల గుర్తించాలని కూడా చెప్పారు. అయితే ఆ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయకుండా ప్రభుత్వం చెప్పిన సాకులు ఏమిటంటే. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అయినట్లు ఇంత మందికి సహాయం తల పెట్టడం వలన, నిజంగా సహాయం తీసుకోవాల్సిన వారికి, నష్టం జరుగుతుంది అని. ఈ విధానం రాజ్యాంగ 340 నిబంధనలోని షరతులకు విఘాతం కలిగిస్తుంది కనుక ఈ కమీషన్ నివేదికను,చేసిన సిఫారసులను లోపాలను సవరించాల్సిన ప్రభుత్వం ప్రకటించింది.ఈ కమిషన్ మీద 1956లో సెప్టెంబర్లో పార్లమెంటులో చర్చకు పెట్టిన ఏమీ కూడా చేయకపోగా రిజర్వేషన్లను వ్యతిరేకించారు, కులాల ఆధారంగా లెక్కలు జరగకూడదని వాదించారు,ఇంతేగా 1977లో జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బీసీలకుకే.కే కమిషన్ నివేదికను ముఖ్యంగా బీసీ కుల జన గణన ను చేపడుతామని ప్రకటించి జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ కే.కే కమిషన్ నివేదికను అమలు పరచలేదు, పోగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మరో విధంగా స్పందించి కాక కాలేల్కర్ కమిషన్ తయారు చేసిన నివేదిక చాలా సంవత్సరాలు అయిపోయింది అప్పటినుంచి చాలా మార్పులు వచ్చాయనిమరొక కమిషన్ను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. దాని ఫలితంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిపి మండల్ ఆధ్వర్యంలో రెండవ బిసి కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమించింది .రెండవ కమిషన్ కూడా, 1980 డిసెంబర్ 31 వరకు కమిషన్ నివేదికను ప్రధాని ఇందిరాగాంధీకి సమర్పించింది. ఆ కమిషన్ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. 1988-1990 వరకు బహుజనసమాజ్ పార్టీ కూడా మండల నివేదిక అమలకు ఉద్యమించింది, ఢిల్లీలో బోట్స్ కబ్ల్ వద్ద కాన్సిరాం 48 రోజుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఎట్టకేలకు అప్పటి ప్రధానమంత్రి వి.పి సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదిక అమల గురించి ప్రకటన చేశారు. దానితో దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర కుల ఆధిపత్య కులాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది, దేశమంతా ఒక్కసారిగా అన్ని అగ్రకుల పార్టీ నాయకులు మండల నివేదికను అమలు వ్యతిరేకించారు..భారతదేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు బ్రిటిష్ వార్ కడుపుమంటతో బాధపడ్డారు, దక్షిణాఫ్రికాలో తమ అణిచివేత ను నల్లవారు ప్రశ్నించినప్పుడు తెల్లవారు కడుపుమంట చూపారు. అదేవిధంగా 20 శాతంగా ఉన్న ఆధిపత్య కులాలు మిగిలిన ప్రజలను సామాజిక అన్యాయానికి గురి చేసినప్పుడు అణచి వేయబడ్డ కులాలు అగ్రకుల ఆధిపత్యంలో వెట్టిచాకిరికి గురి అయ్యాయి,మండల్ కమిషన్ నివేదిక వ్యతిరేక వాదనలు చేసే వాదనలన్నీ ఉన్నత వర్గీయులె,a అగ్రకులాల ఈ చరిత్ర పరంపరలో ఎప్పటికీ వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలు భావించిన మొట్టమొదటిగా అడ్డుకునేది అగ్రకులాలే నాయకులు. ఇకనైనా మేల్కోండి ఈ దేశ బిసి ప్రజలారా.. ఒక అడవిలో ఎన్ని పులులు ఉన్నాయే. ఒక అడవిలో ఎన్ని కుందేళ్ళు ఉన్నాయో? ఎన్ని జాతీయ పక్షులు నెమళ్లు ఉన్నాయో? ఎన్ని విష సర్పాలు ఉన్నాయో? ఒక ఊరిలో ఎన్ని జంతువులు ? లెక్కలు చేసే ఈ కాలంలో ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా బీసీ కుల జనగణన చేయకపోవడంతో. ఒకవేళ చేస్తే ఆంతర్యం వారి పీఠలు పిక్క టిల్లుతాయే?. భయం అగ్రకుల ఆధిపత్య పార్టీలకు మాత్రమే ఉంటుంది,ఇకనైనా బిసిల ఓట్లు రూపంలో చూడకుండా, ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించి, బీసీ కుల జనగణనే ప్రధాన మానిఫెస్టో గా పెట్టుకొని ఆ దిశగా బిసి కుల జనగణన చేయాలని ఈ దేశ ఓబిసి ప్రజలందరూ. వారి వారి లెక్కల కొరకు ఆశిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి దేశ వ్యాప్త జనగణన లో బీసీ కాలాన్ని చేర్చకపోవడం కూడా బీసీల నమ్మించి పబ్బం గడుపుతున్నట్లుగానే ఉంది.బీసీఉద్యమాలుతీవ్రతరమైనప్పుడు ఉద్యమాలను నిప్పుల మీద నీళ్లు చల్లినట్లుగా హామీలు ఇవ్వడం అమలు పరచకపోవడం అనేది నిత్యం బీసీలు ఎదుర్కొంటున్న నిత్య సమస్యలను మిగిలిపోయింది. ఇకనైనా దేశవ్యాప్తంగా జనగణన కులగణన చేస్తున్న ప్రభుత్వాలు ఆ జనగణన లో బీసీ కాలాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సమాజం కోరుతా ఉంది.

‌ ‌ సామాజిక విశ్లేషకులు
మారోజు సోమా చారి.