prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 11:49 am Digital Edition : PRAJA VANI

చీకట్లను తొలగించి..ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి

చీకట్లను తొలగించి..ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి..!

–జనగామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08(ప్రజావాణి)::

దీపావళి పర్వదినాన్ని పురస్కరిం చుకుని జనగామ నియోజకవర్గ ప్రజ లందరికీ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్ రెడ్డి హృదయపూర్వక శుభా కాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయా నికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సాను కూల ఆలోచనలు, సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.

ఈ పండుగ వెలుగులు ప్రతి ఇంటా వెల్లి విరియాలని, ప్రజల జీవితాల్లో సుఖసం తోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంప దలు నిండాలని కోరుకున్నారు. కుటుం బాల మధ్య ప్రేమానురాగాలు, సమా జంలో ఐకమత్యం, సోదరభావం పరిఢవిల్లాలని పేర్కొన్నారు.

జనగామ నియోజకవర్గం అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగాలని, ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నియోజక వర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.