prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 1:28 pm Digital Edition : PRAJA VANI

చిలకలూరిపేటలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – బారులు తీరిన ఓటర్లు

చిలకలూరిపేటలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – బారులు తీరిన ఓటర్లు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 చిలకలూరిపేట పల్నాడు జిల్లా

చిలకలూరిపేట: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, కుమ్మరి కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.

పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు ఉత్సాహంగా క్యూలైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు.

అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, క్యూలైన్లను ఏర్పాటు చేసి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా ముందుకు రావడంతో పట్టణంలో ప్రజాస్వామ్య పండుగ సందడి నెలకొంది.