prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:32 pm Digital Edition : PRAJA VANI

చాగంటి కోటేశ్వరరావు పర్యటనలో జమ్మికుంట మీడియాకు అవమానం

చాగంటి కోటేశ్వరరావు పర్యటనలో జమ్మికుంట మీడియాకు అవమానం

* ఆహ్వానించి మరీ ఫోటోలు వీడియోలు తీయొద్దనడం ఎంతవరకు సమంజసంస్థానిక మీడియా ఆవేదన

జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శివాలయం కిప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు జమ్మికుంట పర్యటన సందర్భంగా స్థానిక మీడియాకు ఎదురైన అనుభవం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆయన పర్యటనకు రెండు మూడు రోజుల ముందునుంచే స్థానిక మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించిన నిర్వాహకులు, తీరా కార్యక్రమం వద్దకు వెళ్లిన తర్వాత ఫోటోలు తీయొద్దు, వీడియోలు చిత్రీకరించొద్దంటూ ఆంక్షలు విధించడం స్థానిక జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసిందిదేవాలయ గర్భగుడిలో దేవుడి ఫోటోలు, వీడియోలు తీయకూడదనే నిబంధనలు ఉండటం అందరికీ తెలిసిన విషయమే. అయితే కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ వ్యక్తి ఫోటోలు, వీడియోలు కూడా తీయకూడదని ఆంక్షలు విధించడం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు మీడియా అవసరం ఉన్నప్పుడు ఆహ్వానించి ప్రచారం చేయించుకుని తీరా అక్కడికి వెళ్లాక అవమానకరంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనినిలదీస్తున్నారుచాగంటి కోటేశ్వరరావు వంటి గొప్ప వ్యక్తి జమ్మికుంటకు రావడం సంతోషకరమే. ఆయన చెప్పే ఆధ్యాత్మిక సందేశాలు ప్రజలకు చేరాల్సిందే. అయితే ఆయన పర్యటనకు సంబంధించిన వార్తలు కార్యక్రమ విశేషాలు ప్రజలకు తెలియజేసే స్థానిక మీడియాను గౌరవించాల్సిన బాధ్యత నిర్వాహకులపై లేదాస్వచ్ఛంద సేవా సంస్థ అన్నపూర్ణ నిర్వాహకులు మీడియాను ఆహ్వానించినప్పుడు మీడియా ప్రతినిధులకు తగిన సమాచారం, నిబంధనలు ముందుగానే తెలియజేయాల్సిన అవసరం లేదామీడియాను పిలిచి, అక్కడికి వెళ్లిన తర్వాత ఫోటోలు, వీడియోలు తీయొద్దని చెప్పడం స్థానిక జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుమరోవైపు కార్యక్రమం సందర్భంగా భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, పెద్ద సంఖ్యలో పోలీసులు విధుల్లో ఉండటం కనిపించింది. ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు, సిబ్బంది పడిన ఇబ్బందులను కూడా నిర్వాహకులు ముందుగానే పరిగణనలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉండేదిమీడియా అంటే అవసరమైనప్పుడు పిలిచి ప్రచారం చేయించుకునే సాధనం కాదు. మీడియాకు కూడా ఆత్మగౌరవం ఉంటుందిచాగంటి కోటేశ్వరరావు వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూనే జమ్మికుంట స్థానిక మీడియా ప్రతినిధుల పట్ల జరిగిన ఈ వ్యవహారంపై నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం ఉంది. మీడియాను ఆహ్వానించడంలో ఒక విధానం కవరేజీ విషయంలో మరో విధానం ఉండకూడదుజమ్మికుంట మీడియాను గౌరవించండి. మీడియా సహకారం కావాలంటే మీడియా ఆత్మగౌరవాన్ని కూడా గుర్తించండి. ఇదే స్థానిక జర్నలిస్టుల ప్రధాన డిమాండ్.