*చండూరు లో అంబరాన్నంటిన సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో, చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ శ్రేణులు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాయి. స్థానిక ఇందిరా గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు.
ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించడంపై నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని వారు కొనియాడారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందని, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బురకల బిక్షమయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షులు గండు వెంకట్ గౌడ్, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గండూరి నరసింహ ముదిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు సయ్యద్ జావిద్, చండూరు మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇరిగి శంకర్, బొమ్మకంటి సత్యనారాయణ ముదిరాజ్, రాపోలు వెంకటేశం, కారింగు మల్లికార్జున ముదిరాజ్, బుచ్చాల ప్రవీణ్ గౌడ్, పుల్లెంల మాజీ ఉప సర్పంచ్ ఇరిగి బుచ్చయ్య, కొయ్యగూర శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.