*చండూరు మున్సిపాలిటీ అన్ని వీధుల్లో సిసి రోడ్లను నిర్మిస్తాం…మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కస్తాల రోడ్డులో వాసవి మాత దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు పాలకవర్గం ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు తెలిపారు. చండూరు మున్సిపాలిటీలో ఉన్న అన్నివీధుల్లో సీసీ రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు, భక్తులకు మరియు వాహనదారులకు రాకపోకల్లో సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, శ్రీమతి మొగుదాల సత్తమ్మవెంకన్న మరియు చండూరు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, ఏకాలపు ఆంజనేయులు, రంగన్ భాయ్ వెంకన్న, నల్ల సత్యనారాయణ, గార్లపాటి వెంకన్న, సముద్రాల వెంకన్న, పులిపాటి ప్రసన్న మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.