prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 6:54 pm Digital Edition : PRAJA VANI

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు స్పాట్లో మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు స్పాట్లో మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 8 సిఎస్పురం మార్కాపురం జిల్లా

సిఎస్పురం మండలం మైదుకూరు టు సింగరాయకొండ 167 బి నేషనల్ హైవే ఉప్పలపాడు స్టేజి వద్ద రెండు బైకులు ఎదురెదురు ఢీకొనడంతో ఒకరు స్పాట్లో మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి కడప జిల్లా బి కోడూరు మండలం హైత్రం పేటకు చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి(23) సాఫ్ట్వేర్ ఇంజనీరు స్పాట్ లోనే మృతిచెందగా అతని మామ సిద్ధారెడ్డి కాలు విరిగిపోగా సిఎస్పురం కి చెందిన పాశం వెంకటేశ్వర్లు డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి వెంకటేశ్వర రెడ్డి ప్రమాద సంఘటన స్థలాన్ని చేరుకొని తీవ్రంగా గాయపడిన పాశం వెంకటేశ్వర్లు 108 అంబులెన్స్ లో ఒంగోలు తరలించారు సిద్ధారెడ్డిని స్థానిక ప్రాథమిక వైద్యశాలకు తరలించారు మృతి చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి అవి వివాహితుడు కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కొలువుతీరినాడు.