ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు బీర్కూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీర్కూర్ గ్రామంలోని గాంధీ చౌక్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు ఒకచోట...