prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 4:09 pm Digital Edition : BALAKRISHNA BIRKOOR

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు
బీర్కూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీర్కూర్ గ్రామంలోని గాంధీ చౌక్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు ఒకచోట చేరి వేడుకల్లో పాల్గొనడంతో గాంధీ చౌక్ వద్ద సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని శంకర్, బీర్కూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు యమ రాములు, ఉప సర్పంచ్ పరమేష్, మాజీ ఎంపీపీ రఘు, శశికాంత్, విఠల్, సర్పంచ్ దేవి సింగ్, గొండ్ల శ్రీను, రాజు, కుర్మా గంగారాం, గంగోండా, లక్ష్మీనారాయణ, లాయక్, నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ శంకర్, నర్సింలు, రాజు, శ్రీను జెట్టి, మంద గంగాధర్, గజేందర్, వీరేశం, పిరయ్య తదితరులు పాల్గొన్నారు.