prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 7:54 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల
బుచ్చిరెడ్డి

ప్రజావాణి శాయంపేట

మండల కేంద్రంలోని
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా చక్రపాణి, మారపెల్లి రవీందర్, వైనాల కుమార్, చిందం రవి, సాధు నాగరాజు, మడికొండ రాజు, అబ్బు ప్రకాశ్ రెడ్డి, కొమ్ముల భాస్కర్, శానం కుమారస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు._