prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 9:11 am Digital Edition : PRAJA VANI

ఘనంగా దీపావళి..భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాలు

ఘనంగా దీపావళి..భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాలు..
ప్రజావాణి,ఇనుగుర్తి/ నెల్లికుదురు:చీకటిపై వెలుగు,చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే అతిపెద్ద వెలుగుల పండుగ దీపావళిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు,ఇనుగుర్తి మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాలలో కేదారేశ్వర వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నోముకున్నారు.వేకువ జాము నుంచే తలంట స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు ఆచరిస్తూ వేదమంత్రోచ్ఛారణల మధ్య వ్రత క్రతువులు నిర్వహించారు.సాయంత్రం వేళ పెద్దలు చిన్నలతోపాటు ఆబాల గోపాలం కాకర్స్ వెలిగిస్తూ, మతాబులు పేలుస్తూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా దీపావళిని జరుపుకున్నారు. కాగా కేదారేశ్వర వ్రతాలను ఆచరించడానికి వేద బ్రాహ్మణుల కొరత తీవ్రంగా ఉండడంతో కొందరు భక్తులు మొబైల్ ఫోన్ల ఆధారంగా కేదారేశ్వర వ్రత కల్పన విధానం,వేదమంత్రోచరణలను వింటూ ఆచరిస్తూ వ్రతాలను నిర్వహించుకోవడం కనిపించింది. గ్రామ గ్రామాన ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలను ఆచరించడంతో అందుకు అనుగుణంగా బ్రాహ్మణులు లేకపోవడం పట్ల సెల్ఫ్ ఫోన్లు పవిత్ర వ్రతాలకు ఉపయుక్తంగా నిలిచాయి.