prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 8:09 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్కేసర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర

ఘట్కేసర్, అక్టోబర్ 1 (ప్రజావాణి): ఘట్కేసర్ నుంచి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్రను భక్తిశ్రద్ధలతో చేపట్టనున్నారు. ఓం ఆదిత్య గురుస్వామి, అక్షయ్ గురుస్వామి గురుస్వాముల ఆధ్వర్యంలో స్వాములు ఈ ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధమయ్యారు.

ఈ మహాపాదయాత్రలో రేవంత్ రెడ్డి, రాజు రెడ్డి, గణేష్, యశ్వంత్, సాయిరాం, మధు, మధుసూదన్, శివ, సాయి, వినయ్, శ్రీధర్, రాకేష్ తదితరులు పాల్గొననున్నారు.

అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తి, గురుస్వాముల మార్గదర్శకత్వం, స్వాముల ఐక్యతతో చేపట్టనున్న ఈ పాదయాత్రలో అడుగడుగునా అయ్యప్ప నామస్మరణ చేస్తూ భక్తిభావంతో శబరిమల చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. కఠినమైన నియమ నిష్ఠలు, దీక్షా నియమాలను పాటిస్తూ స్వామివారి సన్నిధికి చేరుకుని అయ్యప్ప దర్శనం చేసుకోనున్నారు.

మహాపాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని, స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.