ఘట్కేసర్లో బాణసంచా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్హెచ్ఓ పి. కిరణ్…..భద్రతా నిబంధనలు పాటించని బాణసంచా దుకాణాలపై కఠిన చర్యలు…
ఘట్కేసర్, నవంబర్ 5 (ప్రజావాణి): దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణసంచా దుకాణాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఘట్కేసర్ ఎస్హెచ్ఓ పి. కిరణ్ తన సిబ్బందితో కలిసి శాశ్వత, తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో బాణసంచా నిల్వలు, భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక పరికరాలను స్వయంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం అవసరమైన పోలీసు, అగ్నిమాపక శాఖ అనుమతులు కలిగి ఉన్నవారు మాత్రమే...