గ్రామ పంచాయతీ వర్కర్ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం
మన ప్రజావాణి | నవంబర్ 10 | నేరేడుగుంట | జిల్లా ప్రతినిధి
గ్రామ పంచాయతీ వర్కర్ పెద్దగొల్ల మల్లేశం తల్లి యాదమ్మ మృతి పట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ గ్రామ పంచాయతీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
యాదమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం పట్ల పాలకవర్గం తమ సానుభూతిని వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యులు బోయిని శంకర్, తుకాపురం పూజిత నవీన్, ఒగ్గు మల్లేశం, ఒగ్గు దేవరాజు, గున్నాల సంగమేశ్వర్ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.