గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి
కడప జిల్లా నవంబర్ 11ప్రజావాణి పోరుమామిళ్ల: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ పూర్తి నిష్పక్షపాతంగా, సక్రమంగా పని చేయాలని మాజీ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, గతంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలీసు...