గ్రామీణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – మోత్య తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
పెద్దవంగర నవంబర్ 04 ప్రజావాణి
పెద్దవంగర మండలం మోత్య తండా గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని, గ్రామ పంచాయతీ భవనాలు గ్రామ పరిపాలనకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు కేటాయించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు, స్థానిక పాలనా వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.