prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 8:49 pm Digital Edition : PRAJA VANI

గోవిజ్ఞాన పరీక్షలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు

*గోవిజ్ఞాన పరీక్షలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు*

*రాయికల్, నవంబర్ 11(ప్రజావాణి)*

గో సంరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల మరియు జిల్లా స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపికైన విద్యార్థులను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ జూపల్లి తిరుపతి రావు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పరీక్ష 15-11-2026, ఆదివారం రోజున హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల, సర్దార్ పటేల్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పరీక్షలో కూడా ఇదే స్ఫూర్తితో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.