prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 4:06 pm Digital Edition : PRAJA VANI

గూడూరు సర్పంచ్ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు

*గూడూరు సర్పంచ్ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు*

*రోడ్డు విస్తరణలో గృహాలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని గూడూరు గ్రామ ప్రజల వేడుకలు*

గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 06. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్టాండ్ నుండి పాకాల వాగు వరకు రోడ్డు కిరువైపులా కొన్ని సంవత్సరాల నుండి స్థిరపడినటువంటి గ్రామస్తులు కలిసి గూడూరు సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ లో తమ గృహాలకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా, నష్టం వాటిల్లకుండా గవర్నమెంట్ సూచించిన విస్తరణకంటే, తక్కువ పరిధిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, లేకుంటే చాలామంది గృహాలను కోల్పోవల్సి వస్తుందని అలాంటి వారికినష్టం వాటిల్లకుండా? తమకు మేజర్ గూడూరు గ్రామ సర్పంచ్ వాంగ్డోత్ సునీత కుమారు నాయక్ అన్ని విధాలుగా సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంటి స్వామి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి, ఎండి. రసూల్, ఓర్సు రాజేందర్, వార్డు మెంబర్ లు కుమార్, పత్తం వెంకన్న, ఏకాంబరం, శిరీష, రాజేష్, శోభన్, వాంకుడోత్ శ్రీను, షాజహాన్, వీరితో పాటు బాధితులు రాసమల్ల యాకయ్య, ఎలమందల సారంగం, కంకటి ముక్తేశ్వర్, బాలగోని శ్రీధర్, కప్పల అనిల్ కిషోర్, కోటయ్య, దేవేందర్, గడీల నరేష్, నల్ల మహేందర్, కృష్ణ, రాము, తంగేళ్లపల్లి సునీల్, సురేష్, బండారి అనిల్, తదితరులు పాల్గొన్నారు.