prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 7:35 pm Digital Edition : PRAJA VANI

గుడిపేట బస్‌స్టాప్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ రైడర్‌కు తీవ్ర గాయాలు

గుడిపేట బస్‌స్టాప్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ రైడర్‌కు తీవ్ర గాయాలు

మంచిర్యాల ప్రజావాణి – నవంబర్ 2

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేట బస్‌స్టాప్‌ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితుడి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయినట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు.

ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.