గుగ్గిళ్లలో ఘనంగా పోషకాహార మహోత్సవం
గుగ్గిళ్లలో ఘనంగా పోషకాహార మహోత్సవం పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం–సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలపరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో గురువారం పోషకాహార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ,పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని సర్పంచ్...