గుగ్గిళ్లలో ఘనంగా పోషకాహార మహోత్సవం
పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం–సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య
బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలపరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో గురువారం పోషకాహార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ,పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని సర్పంచ్ పేర్కొన్నారు.
అనంతరం చిన్నారులకు బరువు, ఎత్తు పరీక్షలు నిర్వహించి, గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శోభ, భారతి, మాజీ ఉపసర్పంచ్ గుగ్గిళ్ల తిరుపతి, అంగన్వాడీ ఆయా సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.