గుంతలమయంగా బ్రాహ్మణపల్లి రహదారి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు అడుగడుగునా భారీ గుంతలు.చెరువులను తలపిస్తున్న రోడ్డు వర్షపు నీరు నిలిచి ఎక్కడ రోడ్డుందో, ఎక్కడ గుంత ఉందో తెలియని దుస్థితి
• నిత్యం ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు • అదే దారిలో అధికారులు, నేతలు వెళ్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆగ్రహం కలువాయి (నెల్లూరు జిల్లా):నవంబర్ 09ప్రజవాని గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ లేక, కనీస మరమ్మతులకు నోచుకోక రహదారి మొత్తం భారీ గుంతలమయంగా తయారైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ గుంతల్లో భారీగా వర్షపు నీరు చేరి, రహదారి కాస్తా చిన్నపాటి చెరువులను తలపిస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు, గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు...